Sunday, September 8, 2024

Naa saami ranga ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ !

అక్కినేని నాగార్జున హీరోగా.. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీ ‘నా సామిరంగ’. ఫ్యామిలీ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీకి కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్ని దర్శకత్వం వహించాడు. ఈ మూవీ సుమారు యాభై కోట్ల వరకు వసూళ్లని రాబట్టింది. ఇదిలా ఉంటే ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో రాబోతుంది. జనవరి 14న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా.. ఫిబ్రవరి 17న ఓటీటీ రిలీజ్‌కి రెడీ అయ్యింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌లో నా సామిరంగ ప్రసారం కానుంది. ఇక ఈ మూవీలో నాగార్జునతోపాటు అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌ కీలక పాత్రలు పోషించారు. ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా చేసింది. దీనికి ఎంఎం కీరవాణి సంగీతం అందించడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement