‘నాంది’ తర్వాత హీరో అల్లరి నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల మరో యూనిక్, ఇం-టె-న్స్ సినిమా ‘ఉగ్రం’తో వస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్కీన్స్ర్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. మిర్నా మీనన్ కథానాయిక. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో హీరో అల్లరి నరేష్ మీడియాతో చిత్ర విశేషా లని పంచుకున్నారు.
ఉగ్రం సినిమాపై చాలా నమ్మకం పెట్టుకున్నట్టున్నారు ?
అవునండీ. చాలా నమ్మకం గా వున్నాను. ఉగ్రం సినిమా చూసిన త ర్వాత ప్రతి క్రాప్ట్n గురించి ప్రత్యేకం గా మాట్లాడుకుంటారు. నాంది త ర్వాత టీ-ం అందరిపై అంచనాలు పెరి గాయి. ఆ అంచనాలు అందుకో వ డం కోసం పదింతలు కసిగా పని చేశాం.
నాంది, ఉగ్రం లాంటి పేర్లు మీ మీద ఊహించుకోవడం కష్టం కదా.. ?
ఇరవై ఏళ్ళుగా అల్లరల్లరి చేయ డంతో అది అలా పెట్టేశా రు. అయితే దాని నుంచి బయటికి రావాలి, ఎప్పు డూ అదే చేస్తుం టే చూసే వారికి, చేసే నాకూ బోర్ కొడుతుంది. మహేష్ బాబు గారి తో చేసిన మహర్షి ఓ కొత్త నమ్మ కాన్ని ఇచ్చింది. అంత సింపతీ పాత్రలో నన్ను అంగీకరించేసరికి ధైర్యం వచ్చింది.
యోక్షన్ పాత్రలు చేయడం సవాల్ గా అనిపించిందా ?
కామెడీ చేయడం చాలా కష్టం. కామెడీ చేసేవారు ఏదైనా చేయగలుగుతారు. రంగ మార్తాండ లో బ్రహ్మనందం గారు, విడుదలలో సూరిలని అందరూ వెల్ కమ్ చేశారు. ఇప్పుడు -టె-ండ్ మారుతోంది. ఉగ్రం విషయానికి వస్తే దర్శకుడు విజయ్ నా ప్లస్సుల కంటే మైనస్సులు ముందుగా చెప్పేశాడు. చాలా జాగ్రత్తలు తీసుకొని, కంట్రోల్ చేసి ఉగ్రం చేశాను.
ఉగ్రంలో మీ పాత్ర ఎలా వుండబోతుంది ?
ఇందులో మూడు వేరియేషన్స్ లో వుండే పాత్రలో కనిపిస్తాను. ఐదేళ్ళ -టైం లిమిట్ లో జరుగుతుంది. ఎస్సై శిక్షణ వుండగా ఒక అమ్మాయిని ప్రేమించడం, తర్వాత పెళ్లి, ఒక కూతురు వుంటు-ంది. పెళ్లి తర్వాత బరువు పెరుగుతారని నా బరువు కూడా కాస్త పెంచాడు విజయ్ మొదట సిఐ, తర్వాత ఎస్ఐ, చివర్లో షార్ట్ హెయిర్ వున్న పాత్ర చేయడం జరిగింది.
హీరోయిన్ మిర్నా ఎంపిక ఎవరి ఛాయిస్ ?
విజయ్ దే. ఇందులో చాలా కష్టమైన ఒక సన్నివేశం వుంది. అందులో కోపం, ఏడుపు, బాధ.. ఇలా అన్నీ కనిపించాలి. ఆ సీన్ ఆడిషన్ ని చాలా చక్కగా చేసింది. నా పాత్రతో పాటు- ప్రయాణం చేసే పాత్రలో కనిపిస్తుంది మిర్నా.
ఎక్కువ యాక్షన్ సీన్స్ చేయడం ఎలా అనిపించింది ?
ఇది వరకూ యాక్షన్ సీన్స్ చేశాను. అవి కామెడీ గా వుంటాయి. నాకు రోప్ , ఫైట్లు- కొత్త కాదు. అయితే ఇందులో ఎమోషన్ కొత్త. ఫైట్లు- కోసం రిహార్సల్ చేయడం కలిసొచ్చింది. యాక్షన్ సీన్స్ అన్నీ డూప్ లేకుండా చేశాను.
ఈవీవీ గారి వారసత్వాన్ని మీరు ఎలా కంటిన్యూ చేయాలని అనుకుంటు-న్నారు ?
ఆయన్ని మించి చేయడం కష్టం. ఆయన పేరు కాపాడుకుంటే చాలు. పరిశ్రమలో వివాదాల జోలికి వెళ్లొద్దు, ఎవరి గురించి చెడుగా మాట్లాడొద్దని ఆయన చెప్పారు. నాన్న గారు చెప్పినట్లు- నా పని తప్ప నాకు మరో ఆలోచన లేదు.
కొత్త సినిమా కబుర్లు ?
నేను ఫారియా అబ్దులా కలసి ఒక సినిమా చేస్తున్నాం. సుబ్బు గారి దర్శక త్వంలో ఓ సినిమా చేస్తున్నాను. అలాగే జెండా అనే కథని కొనుక్కున్నాను.