ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత ఆర్. నారాయణ మూర్తి ‘యూనివర్సిటీ ‘ పేరుతో కొత్త చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ను హాస్యబ్రహ్మ బ్రహ్మానందం విడుదల చేశారు. ఈ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది.
ఈ సందర్భంగా ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ ”యూనివర్సిటీ నా 30 వ సినిమా. బ్రహ్మానందం గారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించాను. ఎడ్యు కేషన్ మీద తీసిన సినిమా ఇది. విజయనగరం పార్లకిమిడి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ తీసాను. అక్కడ నాకు సహకరించిన మంత్రి బొత్స సత్యన్నారాయణ గారికి మిగతా వారికి నా ధన్యవాదములు. వైజాగ్ సత్యానంద్ మాస్టర్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్న స్టూడెంట్స్ ఈ సినిమాలో నటించారు. భారతదేశంలో విద్యా వ్యవస్థ వైద్య సంస్థ లు రెండు సేవా రంగాలు అని రాజ్యాంగం చెపుతుంది. అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు ఈ రెండు రంగాలను ప్రవేట్ పరంగా కాకుండా ప్రభు త్వమే నిర్వహించేలా ఉండాలి. విద్యార్థులు జాతి సంపద వారిని కుల మత భేదం లేకుండా ప్రోత్సహించాలి. విద్య ఇప్పుడు ప్రేవేట్ పరం అయిపోతుంది. భారత దేశంలో విద్యార్థులు ఎదుర్కొంటు-న్న సమస్యల తో తీసాను. అన్నారు.
బ్రహ్మానందం మాట్లాడుతూ ” సినిమానే. నమ్ముకున్న సిద్ధాంతం కోసం పాటు- పడే వ్యక్తి నారాయణమూర్తి. ఆయనతో వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారో నారా యణ మూర్తి ఎలా ఉన్నారో నాకు తెలుసు. ఆయన ఒక గడ్డి పువ్వు.. విద్య బ్యాక్ డ్రాప్‌లో యూనివర్సిటీ- సినిమా తీశారు. అప్పటి లోఉన్న చదువు ఇప్పుడు లేదు. అప్పుడున్న గౌరవం ఇప్పుడు లేదు. ఇపుడు చదువు కొనే రోజులొచ్చాయి. కొన్ని యూనివర్సిటీ-లు విద్యను వ్యాపారంగా మార్చేసాయి. ఎడ్యుకేషన్ మాఫియా కథాంశంతో నారాయణ మూర్తి తీశారు. అందరూ తప్పకుండా చూడండి.విద్య వ్యవస్థ లోపాలు తెలుసుకోవాలి అంటే ఈ సినిమా చూడండి” అని అన్నారు.