యువ హీరో సుధాకర్ కోమాకుల నటిస్తున్న వినోదాత్మక చిత్రం ‘నారా యణ అండ్ కో’. చిన్న పాపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. పాపిశెట్టి బ్రదర్స్‌తో కలిసి సుధాకర్ కూడా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీ-జర్‌ను దర్శకుడు శేఖర్ కమ్ముల లాంచ్ చేశారు. టీ-జర్ నారాయణ, అతని తిక్కల్ ఫ్యామిలీ పరిచయం చేస్తుంది. నారాయణ ఒక సాధా రణ మధ్యతరగతి వ్యక్తి .అతని భార్య ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతుంది. అతని పెద్ద కొడుకు బెట్టింగ్‌పై ఆసక్తి చూపుతుండగా, అతని చిన్న కొడుకు ఫోటోగ్రాఫర్ కావాలనుకుంటు-న్నాడు. ఒక యువకుడు, ఒక స్థానిక డాన్ ..రాజకీయ నాయ కుడు కావాలని అనుకుంటారు. కొందరు బక్రాల కోసం వెదుకుతుండగా నారా యణ కుటు-ంబాన్ని ట్రాప్ చేస్తారు, ఇది కామెడీ అఫ్ ఎర్రర్ ని జనరేట్ చేస్తుంది.
టీ-జర్ విడుదల కార్యక్రమంలో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ” లైఫ్ ఈజ్ బ్యూటీ- ఫుల్ సినిమాలో నటించిన వారంతా పెద్ద పొజిషన్‌లో వున్నారు. సుధాకర్ కూడా ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమాతో తను కోరుకునే స్థాయికి వెళ్తా డని భావిస్తున్నాను. ” అని అన్నారు.
సుధాకర్ కోమాకుల మాట్లాడుతూ ” నారాయణ అండ్ కో లో ఒక నిర్మాత గా కూడా వున్నాను. దర్శకుడు చిన్న చాలా మంచి కథతో వచ్చారు. ‘నారాయణ అండ్ కో .. కోట్లాది మందికి రీచ్ అవుతుంది. ఫ్యామిలీ అంతా కలసి చూడాల్సిన సినిమా. -కై-మ్ కామెడీ. మిడిల్ క్లాస్, -కై-మ్ కామెడీ క్రేజీ కాంబినేషన్. అందుకే తిక్కల్ ఫ్యామిలీ అన్నాను. దేవి ప్రసాద్, ఆమనీ గారితో పాటు- మిగతా వారంతా కూడా అద్భుతంగా నటించారు” అని చెప్పారు. ఆమని మాట్లాడుతూ.. నారా యణ అండ్ కో లో డ్రీం రోల్ చేశాను. ఎప్పటి నుంచో ఇలాంటి పాత్ర చేయాలని వుంది. ఒక ఆర్టిస్ట్‌గా తృప్తినిచ్చే పాత్రని ఇచ్చిన చిన్నా గారికి కృతజ్ఞతలు.
దర్శకుడు చిన్నా పాపిశెట్టి మాట్లడుతూ ” క్లీన్ కామెడీ వుంటు-ంది. ఫ్యామిలీ అంతా కలసి చూసే సినిమా ఇది. సుధాకర్ గారు వచ్చిన తర్వాత నిర్మా ణ భారం సగం తగ్గిపోయింది. ” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సినిమా యూనిట్ అంతా పాల్గొన్నారు. సురేష్ బొబ్బిలి, డా. జోస్యభట్ల, నాగ వంశీ త్రయం సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ, సిద్దం మనోహర్ అడిషినల్ సినిమాటోగ్రఫీ అందించారు.