Tuesday, November 26, 2024

తండ్రి పై నారప్ప కూతురు ప్రశంసలు !!

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం నారప్ప. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా సక్సెస్ సాధించడం పట్ల సినీ ప్రముఖులు వెంకటేష్ పై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. అయితే ఇప్పుడు వెంకటేష్ పై ఆయన కుమార్తె ఆశ్రిత ప్రశంసలు కురిపించారు.

తన తండ్రి నటనకు ఫిదా అయిపోయానని ప్రతి సినిమా విడుదలైన మొదటిరోజు మొదటి ఆట చూసే తాను ఇప్పుడు మాత్రం ఓటీటీ లో చూడాల్సి వచ్చిందని… ఇంటికి దూరంగా ఉన్న తనకు ఇదే కుదిరిందని పేర్కొంది. నారప్ప గా వెంకటేష్ అద్భుతంగా నటించడానికి కారణం ఆన్ స్క్రీన్ మీద కాకుండా ఆప్ స్క్రీన్ మీద కూడా ఆయన మనస్తత్వం అంతే కావడమని చెప్పుకు వచ్చింది. తండ్రి లోని గొప్ప గుణాలలో కనీసం సగం ఉన్న అది తనకు గర్వకారణమని పేర్కొంది. ఆయన లాంటి గొప్ప వ్యక్తి మరొకరు ఉండరని చెప్పుకొచ్చింది ఆశ్రిత..

Advertisement

తాజా వార్తలు

Advertisement