నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సరిపోదా శనివారం. రిలీజ్ అయిన తొలి రోజునుంచే పాజిటివ్ టాక్ సంపాదంచిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటుంది. ఈ చిత్రం 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 75.26 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ వారాంతం వరకు ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలున్నాయి.
ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో విలక్షణ నటుడు ఎస్.జె. సూర్య విలన్ పాత్రలో నటించాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు, డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించారు. లాంగ్ రన్‌లో ఈ సినిమా మరింత వసూళ్లు సాధించే అవకాశాలున్నాయి.