నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన తాజా చిత్రం “సరిపోదా శనివారం”. నాని కెరీర్లో మరో మాస్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా అతడి కెరీర్లో మరో క్రేజీ ఓపెనింగ్‌ని అందుకుని హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా ఏపీ, తెలంగాణలోనే కాకుండా యూఎస్ మార్కెట్లోనూ భారీ కలెక్షన్లను రాబడుతోంది. దీంతో రెండు రోజుల పాటు ప్రపంచ వ్యాప్తంగా అదిరే స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది.
మేకర్స్ తెలిపిన అధికారిక లెక్కల ప్రకారం ఈ సినిమా రెండు రోజుల్లో 36.03 కోట్లు వసూలు చేసింది. దీంతో నాని కెరీర్లో అధిరే ఓపెనింగ్స్ రాబట్టిన మరో చిత్రంగా “సరిపోదా శనివారం” నిలిచింది. జేక్స్ బిజోయ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించిన సంగతి తెలిసిందే.