Friday, November 22, 2024

న‌టుడిగా ఆనంద‌ప‌డ‌తాను… కానీ తృఫ్తి చెంద‌ను

తెలంగాణ నేపథ్యంలో వచ్చిన మరో చిత్రం దసరా. నాని, కీర్తి సురేష్‌ జంటగా నటించారు. శ్రీకాంత్‌ ఓదెల దర్శ కునిగా పరిచయమయ్యారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మిం చారు. గత వారం ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ విజయం దక్కించుకుంది. పాన్‌ ఇండియా సిని మాగా అన్ని చోట్ల ఆదరణ పొందుతోంది. నాని కెరీర్‌లో భారీ హిట్‌ సినిమాగా నిలుస్తుందని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో తన అనుభవాలను, అనుభూతిని మీడియా తో పంచుకున్నారు హీరో నాని.

దసరా విజయం ఎలా ఆస్వాదిస్తున్నారు ?
ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. సినిమా విడుదలైనప్పటి నుంచి నా ఫోన్‌ మ్రోగుతూనే వుంది. చాలా ఆనందంగా వుంది.
దసరా షూటింగ్‌ అనుభూతి గురించి చెప్పండి ?
లొకేషన్‌ లో ఎంజాయ్‌ చేస్తూ చేసిన సీన్‌ ఏదీ లేదు. అన్నీ చాలా కష్టపడి చేసినవే. దుమ్ము, ధూళి, వేడి మధ్య పని చేశాం. అయితే బాగా వస్తున్నాయని ఫీలింగ్‌ మాత్రం అన్ని సీన్లకి వుంది. థియేటర్‌ లో ఎలా వుంటు-ందో అని అని పించింది మాత్రం దసరా -్లకె-మాక్స్‌. ఆన్‌ లైన్‌ ఎడిటింగ్‌ చూసినప్పుడే మేము షాక్‌ అయ్యాం.
రామ్‌ చరణ్‌ కు రంగస్థలం, అల్లు అర్జున్‌ కి పుష్ప.. మీకు దసరా అలా అని అంటున్నారు?
నటు-డిగా ఆనందపడతాను. కానీ తృప్తి పడను. ఎప్పుటైతే తృప్తి పొందుతామో ఆతర్వాత చేసే ప్రయత్నంలో అలసత్వం వచ్చేస్తుంది. ఈ సినిమాకే కాదు.. ఏ సినిమాకి తృప్తి పడను.
కథ విన్నప్పుడే దసరాకి ఇంత రెస్పాన్స్‌ వుందని అనుకున్నారా ?
ఈ కథ విన్నప్పుడే బెస్ట్‌ -టె-క్నిషియన్స్‌ శ్రీకాంత్‌ కి ఇవ్వాలని డిసైడ్‌ అయ్యాను. సినిమా చేస్తున్నపుడే శ్రీకాంత్‌ చాలా పెద్ద డైరెక్టర్‌ అవుతాడని చెప్పాను.
మిెగతా భాషలల్లో తీసుకురావాలని ఎప్పుడు నిర్ణయిం చారు ?
కథ విన్నప్పుడే. ప్రేమ స్నేహం పగ యూనివర్శల్‌గా కనెక్ట్‌ అయ్యే ఎమోషన్స్‌. మన కల్చర్‌ని సెలబ్రేట్‌ చేసుకునే సినిమా ఏదైనా దొరికితే అది అందరి దగ్గరకి తీసుకెళ్లడం మన బాధ్యత. ఈ సినిమా చేస్తున్నపుడు బతుకమ్మ తో పాటు- చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇలాంటి కథ వచ్చినపుడు ఇది మా కల్చర్‌ చెప్పడం మన బాధ్యత. కాంతారతో భూత్‌ కొళా అనేది కర్ణాటకలో వుందని దేశంలో అందరికీ తెలిసిం ది. ఇలా మన కల్చర్‌ ని చెప్పే అవకాశం వచ్చినపుడు దానిని అందరి దగ్గరికి తీసుకెళ్ళాలి.
ఇప్పుడు మాస్‌ రస్టిక్‌ సినిమాలు నడుస్తున్నాయి కదా.. ఇలాంటి సినిమా కోసం ఇన్నాళ్ళు ఎదురుచూశారా ?
నేను దేని కోసం ఎదురుచూడను. దసరా మాస్‌ సిని మా. పెద్ద బ్లాక్‌ బస్టర్‌. ఈ సినిమా విడుదలకు ముందే దాని నుంచి బయటికి వచ్చేశాను. ఇప్పుడు ఆరేళ్ళ పాపకి తండ్రిగా ఓ సినిమా చేస్తున్న. నేను ఏ బ్రాకెట్‌లో పడకూదని భావిస్తాను.
మీ గత సినిమాల విజయాలకి మాస్‌ దసరా విజయానికి ఎలాంటి తేడా వుంది ?
ఈ సినిమా విడుదలకు ముందు మీరు లవర్‌ బాయ్‌ కదా దసరా ఎలా వుంటు-ందని కొందరు అడిగారు. కానీ నా కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్స్‌ దసరా, ఎంసిఏ, నేను లోకల్‌. మూడు మాస్‌ సినిమాలు. నేను ప్రతిసారి ప్రూవ్‌ చేస్తూనే వున్నాను.
నేను ఏది జోనర్‌ వారిగా చూడను. నచ్చితే చేసేస్తాను.
మీ సినిమాల ద్వారా దాదాపు 10 మంది దర్శకులు పరిచయం అయ్యారు. కదా ?
సేఫ్‌ గేమ్‌ గొడవే మనకి లేదు కొత్త దర్శకులతో పని చేయాలని ప్రత్యేకంగా ఏమీ అనుకోను. కథ నచ్చితే చేయాలనిపిస్తే చేస్తాను.
నాని.. బి ఫోర్‌ దసరా ఆప్టnర్‌ దసరా అంటు-న్నారు ?
ఇది నేను చాలా సార్లు విన్నాను.. భలే భలే మగాడివో, జెర్సీ, నిన్ను కోరి సినిమాలకి విన్నాను. ఇప్పడు దసరాకి అంటు-న్నారు.
దసరా మీకు ఎలాంటి కాన్ఫిడెన్స్‌ ఇచ్చింది ?
నాని మంచి సినిమాలు చేస్తాడని చాలా మంది బాక్సాఫీసు సినిమాలతో పోలికలు తెస్తారు. ఇక నుంచి ఈ కంపారిజన్లు ఆగిపోతాయి. ప్రతి సినిమా ఒక టార్గెట్‌ వుంటు-ంది. దాన్ని అర్ధం చేసుకోవాలి. ప్రతి సినిమాని ప్రత్యేకంగా చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement