యంగ్ టైగర్ ఎన్టీఆర్… ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన నటనతో డాన్స్ తో కోట్లాదిమంది అభిమానుల ప్రేమాభిమానాలు పొందాడు ఎన్టీఆర్. కాగా నేడు ఎన్టీఆర్ చిన్న కొడుకు భార్గవ్ రామ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా భార్గవ్ రామ్ కు సోషల్ మీడియా వేదికగా అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఎన్టీఆర్ 2011 మే 5న లక్ష్మీప్రణతి ని వివాహం చేసుకున్నారు. అయితే ఎన్టీఆర్ కు ఇద్దరు కొడుకు.
మొదటి కుమారుడు పేరు అభయ్ రామ్, రెండవ కొడుకు పేరు భార్గవ్ రామ్. భార్గవ్ రామ్ జూన్ 14 2018 లో పుట్టారు. కాగా కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు.