Wednesday, January 1, 2025

Nagarjuna | ప్రధాని మోడీకి నాగార్జున కృతజ్ఞతలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అక్కినేని నాగార్జున కృతజ్ఞతలు తెలిపారు. మన్‌కీ బాత్‌లో తన తండ్రి నాగేశ్వరరావు పేరును ప్రస్తావించడంపై హర్షం వ్యక్తంచేశారు. ‘‘మా నాన్న శతజయంతి ఏడాది సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నందుకు ప్రధానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు’’ అంటూ ఎక్స్‌ వేదికగా కామెంట్‌ చేశారు.

భారతీయ సినిమాకు ఏఎన్నార్ సేవలు భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తినిస్తాయని నాగార్జున పేర్కొన్నారు. ఈ గుర్తింపు మా కుటుంబంతోపాటు సినీ ప్రపంచానికి దక్కుతుందన్నారు. ఆయన సినీ జీవితం ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement