Friday, January 10, 2025

TG | తెలంగాణ టూరిజంపై నాగ్ స్పెషల్ వీడియో!

తెలంగాణ పర్యాటక ప్రదేశాలు, టెంపుల్ టూరిజం, తెలంగాణ వంటకాలపై కింగ్ నాగార్జున ప్రత్యేక వీడియో చేశారు. తెలంగాణలో రుచి చూడాల్సిన వంటకాలు, చూడదగ్గ ప్రదేశాల గురించి చెప్పారు. సందర్శించదగిన ఆలయాలను వివరించారు. ఎక్స్ వేదికగా రిలీజ్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.

- Advertisement -

వీడియోలో నాగార్జున మాట్లాడుతూ..

‘‘అందరికీ నమస్కారం.. నేను మీ నాగార్జున. చిన్నప్పటి నుంచి తెలంగాణ మొత్తం తిరిగాను. ఇక్కడ అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. జోడేఘాట్ వ్యాలీ, మిట్టే, బొగోటా జలపాతాలు అందంగా ఉంటాయి. దేవాలయాల విషయానికి వస్తే.. వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం అందరూ చూడాలి. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇది నిజంగా అందంగా ఉండటమే కాదు, ఆధ్యాత్మికతను కూడా పెంచుతుంది. యాదగిరి గుట్ట చాలా సార్లు వెళ్లాను. ఆ ఆధ్యాత్మిక అనుభూతిని మాటల్లో వర్ణించలేను.

తెలంగాణ భోజనంలో జొన్నరొట్టె, అంకాపూర్‌ చికెన్‌.. స్నాక్స్‌ విషయానికొస్తే, సర్వపిండి చాలా ఇష్టం. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్‌ బిర్యానీ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. ఇవన్నీ మర్చిపోలేను. మీతో చెబుతుంటే నా నోరూరుతోంది. ప్రజల ఆదరణ కూడా చాలా బాగుంటుంది. మీరంతా తప్పకుండా తెలంగాణ రండీ. వచ్చి ఎంజాయ్ చేయండి. జరూర్‌ ఆనా హమారా తెలంగాణ అని వీడియోను ముగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement