అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభుల తెలుగు, తమి ళ ద్విభాషా చిత్రం ‘కస్టడీ’ కృతి శెట్టి కథానాయిక. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. మే 12న సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో కస్టడీ ప్రీరిలీజ్ వేడుక వైభవంగా జరిగింది.
ఈ వేడుకలో హీరో నాగచైతన్య మాట్లాడుతూ ” కస్టడీ కథ వెంకట్ ప్రభు గారు చెప్పినప్పుడు లేచి ఆయన్ని గట్టిగా హాగ్ చేసుకున్నాను. నాకు అంత ఎక్సయిట్ మెంట్ ఇచ్చింది ఈ కథ. వెంకట్ ప్రభు గారికి థాంక్స్. తమిళ్‌లో ఆయన ఎన్నో హిట్లు- ఇచ్చారు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులని అలరించ డానికి వచ్చిన ఆయనకు స్వాగతం పలుకుతున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలు శ్రీనివాస్ చిట్టూరి, పవన్ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమాని నెక్స్ట్ లెవల్‌లో కూర్చోబెట్టా రు. నా కెరీర్ లో భారీ చిత్రమిది. అరవింద్ స్వామి గారు ఈ కథ కి ఓకే చెప్పడంతో మా అందరికీ చాలా నమ్మకం మరింత పెరిగింది. శరత్ కుమార్ గారికి, నాకు చాలా యూనిక్ యా క్షన్ డిజైన్ చేశారు. ప్రియమణి గారు తన పాత్రకు చాలా మం చి ఎలివేషన్ ఇచ్చారు. ఈ చిత్రంతో కృతి శెట్టి కెరీర్ మరో స్థాయికి వెళుతుందని నమ్ముతున్నాను. అబ్బూరి రవి గారు మంచి సంభాషణలు ఇచ్చారు. ఛాయాగ్రహకులు కతీర్, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ , రామజోగయ్య శాస్త్రి గారికి, యాక్షన్ మాస్టర్స్ మహేష్, స్టంట్ శివ, డ్యాన్స్ మాస్టర్స్, మా పీఆర్వోలు వంశీ శేఖర్‌కి థాంక్స్. ఇళయరాజా గారు, యువన్ శంకర్ రాజా గారి సంగీతం థియేటర్ లో నేపధ్య సంగీతం ఒక రచ్చే థియేటర్‌లో ఒక మ్యాజిక్ చూపిస్తారు. సినిమా మొదటి ఇరవై నిమిషాలు కూల్‌గా వెళుతుంది. ఇంటర్వెల్‌కి ముందు నుంచి థియేటర్‌లో బ్లాస్ట్ అవుతుంది. అద్భుతమైన యాక్షన్స్ సీక్వెన్స్‌లు వుంటాయి. మీరు కొత్త చైతన్యని చూడ బోతున్నారు. అన్నారు.
దర్శకుడు వెంకట్ ప్రభు మాట్లాడుతూ.. కస్టడీ నా కెరీర్ లో భారీ చిత్రం. ఇది శివ రాజు ల కథ. శరత్ కుమార్, సంపత్, వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో నటించిన, పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. కస్టడీ 2 చేసినప్పుడు కచ్చితంగా తెలుగులో మాట్లాడతాను. అన్నారు . కృతి శెట్టి మాట్లాడుతూ.. కస్టడీ -టైలర్‌కి ఇచ్చిన రెస్పాన్స్ చాలా బావుంది. -టైలర్ ఇంత నచ్చిందంటే సినిమా ఇంకా బాగా నచ్చుతుంది. ఇంత మంచి సినిమాలో పని చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞత లు. అన్నారు. ప్రియమణి మాట్లాడుతూ నాగ చైతన్యతో పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను. మే 12 న సినిమా వ స్తోంది. అందరూ థియేటర్‌లో చూడండి అని కోరారు. అబ్బూరి రవి కూడా మాట్లాడారు.