Saturday, September 14, 2024

Prabhas | స్పిరిట్ కు ముహుర్తం ఫిక్స్..!

‘కల్కి 2898ఏడీ’తో బాక్సాఫీస్‌ రికార్డులను బద్దలు కొట్టేశాడు ప్రభాస్‌. ఓటీటీలో కూడా ‘కల్కి’ చేస్తున్న హంగామా మామూలుగా లేదు. త్వరలో ప్రభాస్‌ నుంచి మరిన్ని అద్భుతాలు రానున్నాయి. వాటిల్లో ఒకటి ‘స్పిరిట్‌’. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్న ఈ సినిమా విషయంలో ఓ తాజా అప్‌డేట్‌ వెలుగు చూసింది. ‘స్పిరిట్‌’ షూటింగ్‌ని వచ్చే ఏడాది జనవరి నుంచి మొదలుపెట్టనున్నారట సందీప్‌రెడ్డి.

ఈ లోపు ప్రభాస్‌ తన ఇతర ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటారు. పాన్‌ ఆసియా లెవల్లో తెరకెక్కనున్న ‘స్పిరిట్‌’ షూటింగ్‌ని నిరవధికంగా ఏడాది పాటు ప్లాన్‌ చేశారట సందీప్‌రెడ్డి. 2026 జనవరిలో సినిమాను విడుదల చేసేందుకు ఆయన కసరత్తులు చేస్తున్నాడు. . ఇందులో ప్రభాస్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రలో నటించనున్నారు. త్రిష కథానాయికగా ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి సందీప్‌ సాలిడ్‌ ప్లానింగ్‌తోనే ఉన్నాడని చెప్పొచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement