Friday, September 20, 2024

Mrunal Thakur | దివ్య పాత్ర‌కు ప్ర‌శంస‌లు…

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన‌ కల్కి సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా వెయ్యి కోట్ల క్ల‌బ్‌లో చేరిన ఈ సినిమాలో ఎంతో మంది ప్రముఖ నటీ నటులు గెస్ట్‌ పాత్రల్లో నటించి సినిమా వెయిట్ ని మరింత పెంచిన విషయం తెల్సిందే. కాగా, వైజయంతి మూవీస్ బ్యానర్ తో మంచి అనుబంధం ఉన్న మృణాల్‌ ఠాకూర్ కల్కి సినిమాలో చిన్నదైన దివ్య పాత్రలో కనిపించింది.

డీ గ్లామర్‌ లుక్ లో మృణాల్‌ ను చూసిన ప్రేక్షకులు సర్‌ప్రైజ్ అయ్యారు అనడంలో సందేహం లేదు. సీతారామం, హాయ్‌ నాన్న, ఫ్యామిలీ స్టార్‌ సినిమాల్లో చూసిన మృణాల్‌ కి కల్కిలో చూసిన మృణాల్‌ కి చాలా తేడా ఉందని, నటన విషయంలో కూడా మంచి మార్కులు పొందినట్లుగా సోషల్‌ మీడియాలో టాక్ వినిపిస్తుంది. అందాల ఆరబోత ఫోటో షూట్స్ తో రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యే మృణాల్ ఠాకూర్ ఈసారి కల్కి ‘దివ్య’ లుక్ ఫోటోతో వైరల్‌ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement