బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్.. ఒక్క మూవీతో టాలీవుడ్ లో మంచి పేరు దక్కించుకున్న విషయం తెలిసిందే. సీతారామం సినిమాలో మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ కు జోడీగా నటించి సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. అటు నార్త్ లో.. ఇటు సౌత్ లో సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. మూవీల సెలక్షన్ విషయంలో అందరినీ ఆకట్టుకుంటుకున్న సిల్వర్ స్క్రీన్ సీత.. రీసెంట్ గా కల్కి 2898 ఏడీలో నటించింది.
మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీలో కూడా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటోంది మృణాల్ ఠాకూర్. అల్ట్రా గ్లామరస్ ఫోటోస్ ను పోస్ట్ చేస్తుంటోంది. తెలుగు సినిమాల్లో సంప్రదాయంగా కనిపించినా.. నెట్టింట మాత్రం అందాలు ఆరబోస్తూ సందడి చేస్తుంటోంది. టైట్ ఫిట్ ఔట్ ఫిట్స్ లో స్కిన్ షోతో ఫిదా చేస్తుంటోంది.
తాజాగా ఫ్యాషన్ స్టైలిష్ట్ నమిత అలెగ్జాండర్.. మృణాల్ క్రేజీ పిక్స్ ను షేర్ చేసింది. మ్యాగ్ జైన్ కోసం దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది అందులో ఒక్కో ఫోటో వేరే లెవెల్ ఉంది. బ్లాక్ కలర్ జంప్ సూట్ లో మృణాల్ క్లీన్ బౌల్డ్ చేస్తోంది. ఎద అందాలతో కవ్విస్తోంది. లాంగ్ ఫ్రాక్ డ్రెస్ లో ఓపెన్ బ్యాక్ తో ఫిదా చేస్తోంది. ట్రెడిషనల్ స్లీవ్ లెస్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేస్తోంది. తన చూపుతోనే అందరినీ మాయ చేస్తోంది.