Friday, October 18, 2024

Mrunal Thakur | లండ‌న్ లో మ‌హాల‌క్ష్మీ కాఫీ పార్టీ

సీతారామం సినిమా వచ్చి 2 ఏళ్లు అవుతున్న సందర్భంగా కాఫీ పార్టీ చేసుకుంది మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం ఈడెన్ బర్గ్ లో ఉన్న అమ్మడు అక్కడ కాఫీ తాగిన ప్లేస్ లో ఫోటోలు దిగి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఓ పక్క సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే ఇలా ఖాళీ టైంలో జాలీ ట్రిప్ వేస్తుంది మృణాల్.

సెట్స్ మీద ఆమె అందంగా కనిపించి నటనతో మెప్పించాలి అంటే షూటింగ్ గ్యాప్ లో ఇలాంటి విహార యాత్రలు ఉపయోగపడతాయని తెలుస్తుంది. బాలీవుడ్ లో హీరోయిన్ గా సినిమాలు చేస్తున్నా అంతగా పాపులారిటీ తెచ్చుకుని అమ్మడు తెలుగులో రెండు సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించింది.

రాబోతున్న సినిమాలతో కూడా మృణాల్ తన టాలెంట్ తో మెప్పించాలని చూస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక సినిమా చేస్తున్న అమ్మడు తెలుగులో నెక్స్ట్ సినిమా సైన్ చేయలేదు. ఐతే సినిమా కథల విషయంలో తన అభిరుచికి తగినట్టుగా ఎంపిక చేసుకుంటున్న మృణాల్ ఆమెలోని గ్లామర్ సైడ్ ని చూపించాలని చూస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement