ఎప్పటికప్పుడు క్యారెక్టర్స్ తగ్గట్టుగా వాళ్లు కూడా చేంజ్ అవుతూ ఉండాలి. మంచి సినిమాలు వస్తే కొన్నిసార్లు పాత్ర డిమాండ్ ను బట్టి గ్లామర్ డోస్ పెంచాల్సి ఉంటుంది. ఇక పాత్రకు తగ్గట్టుగా తనను తాను ఎప్పుడూ సరికొత్తగా మార్చుకునే హీరోయిన్స్ లలో మృణాల్ ఠాగూర్ కూడా ఉంది. ఈ బ్యూటీని మొదటగా తెలుగు ప్రేక్షకులకు సీతారామం సినిమాతో బాగా కనెక్ట్ అయింది.
అయితే అంతకుముందే అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేసింది. అలాగే వెబ్ సీరీస్ లలో కూడా కనిపించింది. ఇక మృణాల్ మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి రావడంతో కొన్నిసార్లు బికినీలో కూడా దర్శనమిచ్చింది. ఇక సీతారామం సినిమా చూసిన తర్వాత తెలుగు ఆడియోన్స్ ఆమె బికినీ ఫొటోలు చూసి షాక్ అయ్యారు. సీత పాత్రలో బాగా కనెక్ట్ అయిన అమ్మడు హఠాత్తుగా అల్ట్రా గ్లామర్ తో షాక్ ఇచ్చేసరికి ఎవరు నమ్మలేకపోయారు.
ఇక మృణాల్ క్యారెక్టర్ కు తగ్గట్టుగా ఫ్యామిలీ స్టార్ లో ఆమె ఎలా కనిపించబోతుందో ఇటీవల ఒక సాంగ్ తో మరోసారి అర్థమయింది. ఫ్యామిలీ స్టార్ కు సంబంధించిన కళ్యాణి వచ్చే వచ్చే.. అనే లిరికల్ పాటను రీసెంట్ గా విడుదల చేశారు. అయితే అందులో లెహంగాలో చాలా ట్రెడిషనల్ లుక్ లో కనిపించిన ఆమె ఒక చాలా క్యూట్ గా కనిపిస్తూనే మరొకవైపు గ్లామర్ ను మరింత ఘాటుగా హైలైట్ చేసింది.