Thursday, September 12, 2024

MR.Bachchan | అదిరిపోయిన మిస్ట‌ర్ బచ్చన్ ట్రైలర్…

YouTube video

హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ రాజా రవితేజ హీరోగా రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “మిస్టర్ బచ్చన్”. ఇదిలా ఉంటే అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. మాస్ రాజా రవితేజ ట్రైలర్‌లో తనదైన మాస్ స్వాగ్ & పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో మరోసారి ప్రేక్షకులను థ్రిల్ చేశాడు. హరీష్ టేకింగ్, హీరో ఎలివేషన్స్ తో ట్రైలర్ అదిరిపోతోంది.

ప్యూర్ కమర్షియల్ ఎంటర్ టైనర్ సినిమాలో ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ ట్రైలర్ కట్ లో కనిపిస్తున్నాయి. ఈ ట్రైలర్‌లో కామెడీతో పాటు రొమాంటిక్ సన్నివేశాలను కూడా చూపించారు. అందాల భామ భాగ్యశ్రీ బోర్సే కూడా తన గ్లామర్‌తో యూత్‌ని ఆకట్టుకుంది. మిక్కీ జె మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ ట్రైలర్‌కు ప్రధాన హైలైట్. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement