మాస్ మహారాజ్ రవితేజ లేటెస్ట్ అప్‌కమింగ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. ప్యూర్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. కాగా, తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.
ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్ట్ 15న సినిమాకి విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా రిలీజ్ కు ఒక్కరోజు ముందు అంటే ఆగస్టు 14 న స్పెషల్ ప్రీమియర్స్ ను సైతం ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
ఇక ఈ సినిమాలో కన్నడ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తొంది. సీనియర్ నటుడు జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన టీజర్, సితార్ సాంగ్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకోగా… షాక్, మిరపకాయ్ వంటి సూపట్ హిట్స్ తర్వాత హరీష్ శంకర్, రవితేజ కాంబోలో రాబోతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.