Friday, September 20, 2024

Mr.Bachchan | హరీష్ శంకర్ కు మాస్ వార్నింగ్..

హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన మూవీ ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌’. ఈ మూవీలో బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బోర్సే క‌థానాయిక‌గా నటించింది. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా… అజయ్ దేవగన్ రైడ్ సినిమాకు రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కింది. దీంతో మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ పై ఫ్యాన్స్ భారీ అంచ‌నాలే పెట్టుకున్నారు. జ‌గ‌ప‌తి బాబు విల‌న్‌గా న‌టించిన ఈ మూవీ నేడు (ఆగ‌స్టు 15) గురువారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

రీమేక్ సినిమా అయినా… హ‌రీష్‌ శంకర్ త‌న‌దైన శైలిలో బాగా తీస్తాడ‌ని పేరుంద‌ని, అలాగే మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌ను కూడా త‌న‌దైన శైలిలో ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో చూపిస్తాడ‌ని భావించిన‌ట్లుగా చెబుతున్నారు. అయితే.. నాలుగు పాటలు, నాలుగు ఫైట్స్ పెట్టి రొటీన్ మాస్ కమర్షియల్ మూవీలా హ‌రీష్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించార‌ని కొంద‌రు అభిమానులు మండిప‌డుతున్నారు.

సినిమాలో అస‌లు పాయింట్ రైడ్ అయితే, దాన్ని ప‌క్క‌న పెట్టి పాట‌లు, వాటి కోస‌మే స్టోరీ అన్న‌ట్లుగా రాసుకున్నాడ‌ని మండిప‌డుతున్నారు. సినిమాలో కంటెంట్ ఉంద‌ని, డైరెక్ష‌న్ మిస్సైంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. హ‌రీష్ శంక‌ర్ గ‌నుక ఆర్టీసీ క్రాస్ రోడ్డు వ‌స్తే ర‌వితేజ ఫ్యాన్స్ కొడ‌తార‌ని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement