డిజిటల్ స్ట్రీమింగ్ ఛానల్స్ ప్రతి వారం పోటీపడి మరి వినోదాన్ని అందిస్తున్నాయి. ఆడియన్స్ కూడా భాషలతో సంబంధం లేకుండా సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇంట్లో కూర్చొని ఆశ్వాదిస్తున్నాయి. ఒకప్పుడు హిందీ సినిమాలు చూడాలంటే హిందీ ఛానల్స్ లో మాత్రమే సాధ్యం అయ్యేది. అయితే డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ వచ్చాక అన్ని భాషలకి సంబందించిన కంటెంట్ ని ఒకే చోట చూడగలుగుతున్నాం.
దీనికారణంగా ఓటీటీకి ఆడియన్స్ ఎక్కువగా ఎట్రాక్ట్ అవుతున్నారు. విజువల్ కంటెంట్ కి భాష అడ్డంకి కాదని అందరూ చెప్పే మాట ఇప్పుడు నిజమని అనిపిస్తుంది. ఓటీటీ ఛానల్స్ లో వెబ్ సిరీస్ లకి వస్తోన్న ఆదరణ భాష పరిమితులు దాటి ఉంటుంది. ప్రతి వారం లాగే ఈ వారం కూడా కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్ని డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ లోకి అందుబాటులోకి వస్తున్నాయి.
అవేంటో ఓ సారి చూసుకుంటే డిస్నీ హాట్ స్టార్ లో తమిళం నుంచి తెలుగులోకి డబ్ అయినా ట్రూ లవర్ మార్చి 27 నుంచి అందుబాటులోకి వచ్చింది. సూపర్ హిట్ మూవీ ప్రేమలు తెలుగు భాషలో మార్చి 29న రిలీజ్ కాబోతోంది. నెట్ ఫ్లిక్స్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ లాల్ సలామ్ మార్చి 29 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఇన్ని రోజులు టీవీకి పరిమితం అయిన కపిల్ శర్మ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ కోసం ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో చేస్తున్నాడు. ఇది మార్చి 30 ప్రారంభం కాబోతోంది. అమెజాన్ ప్రైమ్ లో దీపక్ సరోజ్ లీడ్ రోల్ లో చేసిన సిద్దార్ధ్ రాయ్ మూవీ మార్చి 29న రిలీజ్ కాబోతోంది. నవీన్ చంద్ర నటించిన ఇన్ స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ మార్చి 29న స్ట్రీమింగ్ అవ్వబోతోంది. ఆహా ఓటీటీలో తికమక తాండ అనే మూవీ మార్చి 25న రిలీజ్ అయ్యింది. కమెడియన్ హర్ష లీడ్ రోల్ చేసిన సుందరం మాస్టర్ మూవీ మార్చి 28న అందుబాటులోకి రానుంది. ఈటీవీ విన్ లో ఏం చేస్తున్నావ్ మూవీ మార్చి 28న రిలీజ్ అవుతోంది.