టాలీవుడ్ హీరో నితిన్ నటించిన ‘ఎక్స్‌ట్రా – ఆర్డినరీ మేన్’ నేడు విడుదలైంది. వక్కంతం వంశీ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఎన్.సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటించగా.. రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. వక్కంతం వంశీ రాసిన అత్యుత్తమ కథల్లో ఇదే బెస్ట్ అని సినిమా విడుదలకు ముందు నితిన్ చెప్పడం విశేషం. ప్రేక్షకుల్ని నవ్వించాలన్న ఒకే లక్ష్యంతో ఈ చిత్రాన్ని చేశామని ఆయన చెప్పాడు. సినిమా మొదలైనప్పటి నుంచి ముగింపు వరకు నవ్విస్తూనే ఉంటామని చెప్పుకొచ్చాడు నితిన్.
తాజాగా ఈ సినిమాలో వారిద్దరూ చెప్పిన విధంగానే ప్రేక్షకులు కూడా ఫుల్ కామెడీ ఉందని ఎంజాయ్ చేస్తున్నారు. భీష్మ తర్వాత నితిన్‌కు సరైన హిట్ లేకపోవడంతో ఈ సినిమాపైన ఆయన భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఈ సినిమాలో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్‌గా నటించడం విశేషం. ఈ క్యారెక్టర్‌లో ఆయన ఫర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యాడని, అతడి కామెడీ టైమింగ్ కూడా బాగుందని చెబుతోన్నారు. ‘ఎక్స్‌ట్రా – ఆర్డినరీ మేన్’ ఫుల్ ఫన్‌తో కూడిన చిత్రం.
నితిన్ సరికొత్త రోల్‌లో కనిపించి అదరగొట్టాడు. ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమాలో రావు రమేష్ రాజశేఖర్ కూడా భారీగానే వినోదాన్ని పంచా రు. ద్వితీయార్దంలో అయితే ఫుల్ ఫన్‌గా కొనసాగుతుందని కామెంట్లు చేస్తున్నారు. రాజశేఖర్ రోల్ తక్కువే అయినా ఆయన కనిపించిన సీన్స్ మొత్తం ఆకట్టుకుంటాయని చెబుతున్నారు.శ్రీలీల ను అందగానే చూపారు..
కథ ఏమిటంటే బాలు (నితిన్) ఒక జూనియర్ ఆర్టిస్ట్. తెరమీద చిన్నాచితకా పాత్రలే చేస్తూ ఇంటా బయటా అవమానాలు ఎదుర్కొంటున్నప్పటికీ.. తనమీద తనకున్న నమ్మకంతో ఏ రోజుకైనా పెద్ద ఆర్టిస్టు అవుతానని ధీమాతో ఉంటాడు. అయితే కుటుంబ అవసరాల దృష్ట్యా అతను నటన పక్కన పెట్టి ఉద్యోగం చేస్తాడు. కాలం కలిసొచ్చి పని చేస్తున్న కంపెనీకి సీఈఓ కూడా అవబోతున్న సమయంలో బాలుకి ఒక సినిమాలో హీరోగా అవకాశం వస్తుంది. ఆ ఛాన్స్ కోసం అన్నీ వదులుకుని కష్టపడ్డ అతడికి.. డైరెక్టర్ షాక్ ఇస్తాడు. సినిమాలో అవకాశం చేజారుతుంది. ఈ స్థితిలో అతనో అనూహ్య నిర్ణయం తీసుకుంటాడు. అదేంటి.. దాని వల్ల అతడి జీవితం ఎలాంటి మలుపు తిరిగింది తెలియాంటే …కాసింత నవ్వులు కావాలంటే ఈ చూమీపై లుక్ వేయవచు..