వరుడు కావలెను ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి దర్శకులు లక్ష్మీ సౌజన్య. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..ఈ మూవీలో యంగ్ హీరో నాగశౌర్య, క్రేజీ బ్యూటీ రీతూ వర్మ జంటగా నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. మురళి శర్మ, నదియా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ లో నాగశౌర్య..రీతూవర్మ కాంబినేషన్ కి మంచి టాక్ వచ్చింది. వీరిద్దరూ చూడముచ్చటగా ఉన్నారనే కామెంట్స్ వినిపించాయి. .
స్టోరీ ఏంటంటే నాగ శౌర్య ఎన్నారై యువకుడు ఆకాష్ గా పరిచయం అవుతాడు. ఓ పెళ్లి చూపులు సన్నివేశంతో రీతూ వర్మ భూమి పాత్రలో పరిచయం అవుతుంది. ఆకాష్.. భూమిని హైదరాబాద్ లో కలుసుకుంటాడు. ఆఫీస్ పనిమీద వీరిద్దరి కలయిక జరుగుతుంది. భూమికి.. ఆకాష్ ఇంప్రెస్ అవుతాడు. ఆఫీస్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. డైలాగులు మెప్పించే విధంగా ఉన్నాయి. రీతూ వర్మ క్యారెక్టర్ కు నాగ శౌర్య ఇంప్రెస్ అవుతాడు. ఇంటర్వెల్ సమయానికి రీతూ వర్మ కూడా నాగ శౌర్యని ఇష్టపడడం మొదలు పెడుతుంది. అలా డీసెంట్ మూమెంట్స్ తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది.
ఇక డైలాగులు, ప్రెష్ నేరేషన్ ఫస్ట్ హాఫ్ లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. కాకపోతే స్టోరీ చాలా సింపుల్ అనే ఫీలింగ్ వస్తుంది. పాటల చిత్రీకరణ బావుంది. ఇక సెకండ్ హాఫ్ లో మురళి శర్మ, నదియా మధ్య సన్నివేశాలు బావుంటాయి. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే దిగు దిగు నాగ సాంగ్ ఆకట్టుకుంటుంది. సప్తగిరి కామెడీ అదుర్స్. కానీ క్లైమాక్స్ సన్నివేశంలో బలం లేదనిపిస్తుంది. ఎమోషనల్ గా ఆకట్టుకునే కంటెంట్ క్లైమాక్స్ లో ఉండదు. ఓవరాల్ గా వరుడు కావలెను చిత్రంలో కొన్ని మంచి మూమెంట్స్ ఉన్నాయి. ఆకట్టుకునే డైలాగ్స్ ఉన్నాయి. ఈ చిత్రానికి పోటీగా పెద్దగా మరే సినిమాలు లేవు కాబట్టి వరుడు కావలెను చిత్రం ఏ మేరకు విజయాన్ని అందుకుంటుందో చూడాలి. మరి నాగశౌర్య ఇమేజ్ కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తుందేమో చూద్దాం.