ప్రముఖ సినీ నటుడు అలీ రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్కను కలిశారు. ఈ మేరకు శనివారం సచివాలయంలో ఆయన మంత్రితో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. సినీ నటుడు అలీ, డైరెక్టర్ రమణారెడ్డి కూడా ఉన్నారు.
సామాజిక బాధ్యతతో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా తాను చిత్రీకరించిన నిన్ను, నన్ను కన్నది ఆడది రా అనే పాటను మంత్రి సీతక్కకు అలి చూపించారు. ఈ నెల 8న పాటను ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగే పాట ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆహ్వానించారు.