బుల్లితెర నుంచి వెండితెరకు ప్రమోట్ అయిన బోల్డ్ బ్యూటీగా మౌనీరాయ్ కి గుర్తింపు ఉంది. ఈ భామ ఆరంభం టీవీ స్క్రీన్లపై ఎంత పద్ధతిగా కనిపించిందో ఆ తర్వాత సినీనటి అయ్యాక అంత బోల్డ్ గా మారిపోయింది. తెరను బట్టి అవసరాన్ని బట్టి గ్లామర్ ని ఎలివేట్ చేయడం ప్రారంభించింది.
ఇటీవల హాటెస్ట్ ఫోటో షూట్లతో మౌని మతులు చెడగొడుతోంది. తాజాగా మరోసారి మౌని తనదైన శైలిలో చెలరేగింది. ఈసారి చీరలో సింగారం ప్రదర్శించింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ – చీరకట్టుతో మతులు చెడగొట్టింది. మౌని తెల్ల చీర- రవికె, కాంబినేషన్ గాజులతో మైండ్ బ్లాంక్ అయ్యే ట్రీటిచ్చింది. అలా శిరోజాలు విరబూసి కొత్త లోకంలోకి తీసుకెళ్లింది.
మౌని రకరకాల భంగిమల్లో ఫోజులివ్వగా, వాటిలో కొన్ని పోటోల్లో మౌని తెల్ల చీరలో తళతళా మెరిసిపోతోంది కానీ అక్కడ మట్టి అంటినట్టు కనిపించలేదు. దీనిని బట్టి ఆ గాజు అద్దాల్లోనే ఆర్ట్ అంతా దాగి ఉందని అర్థం చేసుకోవాల్సి వస్తోంది. మాయదారి మౌని ఆ వివరం ఏమిటో స్పష్ఠంగా ఇప్పటికైనా చెబుతుందా లేదా? అంటూ యూత్ ప్రశ్నిస్తున్నారు.