Tuesday, November 26, 2024

ఇతగాడే అందరి కంటే అందగాడట..

ప్రపంచంలోనే అందిరికంటే అందగా వుండే వ్యక్తి ఎవరు…అంటే ఏ హాలీవుడ్ బ్యూటీ పేరో లేక పాప్ సింగర్ పేరు చెబుతుంటారు అందరు.. కాని మగవాళ్లలో అందరి కంటే అందగాడంటే ఏం చెబుతారు. తాజాగా ఇదే అంశంపై సర్వే జరిపింది ఓ బ్యూటీ వైబ్ సైట్..అప్పుడు తేలిందేమంటే ప్రపంచంలోనే అత్యంత అందగాడిగా బీటీఎస్ పాప్ బ్యాండ్ లోని సింగర్ ‘జిన్’ అని స్పష్టం చేశారు.

యాండ్రీ బ్యూటీ స్టూడియో వెబ్ సైట్ ఫైనల్ రిజల్ట్ ప్రకారం జిన్ ముఖంలోగానీ, శరీరంలోగానీ, ఇంకే అంశంలోగానీ, కోణంలోగానీ…. అసలు మార్పుచేర్పులు అవసరమే లేదట! ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అంటూ ప్రకటించారు. అందుకే, ఆయన నంబర్ వన్ అందగాడు అని కూడా కితాబునిచ్చారు.

కిమ్ సియోక్ జిన్ పూర్తి పేరైతే అందరూ ‘జిన్’ అని షార్ట్ గా పిలుస్తారు ఈ కొరియన్ సెన్సేషనల్ సింగర్ ని. మొత్తం ఏడుగురు గాయకుల బీటీఎస్ టీమ్ లో జిన్ కూడా ఒకరు. అయితే, అందం విషయంలో, స్టైల్ విషయంలో మాత్రం అతడికి తిరుగులేదు. ఈ విషయం చాలా సార్లు ఆయన అభిమానులు అంతర్జాలంలో తీర్మానం చేసేశారు కూడా.

SEOUL, SOUTH KOREA – MAY 21: Jin of BTS attends a press conference for BTS’s new digital single ‘Butter’ at Olympic Hall on May 21, 2021 in Seoul, South Korea. (Photo by The Chosunilbo JNS/Imazins via Getty Images)

లెటెస్ట్ గా ఓ వెబ్ సైట్ మొత్తం 4941 మంది ఇంటర్నేషనల్ మేల్ సెలబ్రిటీస్ ని కంప్యూటర్ టెస్ట్ కు స్వీకరించింది. అన్ని వేల మందిని ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా అందంలో తూకం వేసింది. ఒకరితో ఒకర్ని ముఖ కవళికలు, ఇంకా అనేక ఇతర అంశాల ఆధారంగా పోల్చి చూసింది. ఫైనల్ గా తేలింది ఏంటంటే… బీటీఎస్ తాలూకూ జిన్ మచ్చలేని చంద్రుడట!

ఇది కూడా చదవండి: ఇంటి దొంగతో జాగ్రత్తగా ఉండండి!

Advertisement

తాజా వార్తలు

Advertisement