Monday, September 16, 2024

Mokshagnya | బాల‌య్య‌కు వార‌సుడొచ్చాడు..

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం వచ్చేసింది. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం చేశారు. యంగ్‌ ప్రశాంత్‌ వర్మ ద‌ర్శ‌క‌త్వంలోని మూవీతో బాలయ్య కుమారుడిని వెండితెరకు పరిచయం కానున్నాడు. ఈ విషయాన్ని తెలుపుతూ పోస్ట్ పెట్టారు.

‘సింబా ఈజ్‌ కమింగ్‌’ అంటూ మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన లుక్‌ను విడుదల చేశారు. దీంతో అభిమానులు విషెస్‌ చెబుతున్నారు. తొలి సినిమాకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ కామెంట్స్‌ చేస్తున్నారు. రెండు రోజులుగా ప్రశాంత్‌ వర్మ వరుస పోస్ట్‌లతో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి హింట్ ఇస్తూ వచ్చారు.

‘నా యూనివర్స్‌ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది’, ‘వారసత్వాన్ని ముందుకుతీసుకెళ్లే అద్భుత క్షణం’ అంటూ వరుస పోస్ట్‌లు పెట్టారు. తాజాగా మోక్షజ్ఞ లుక్‌ను పంచుకొని తన తర్వాత సినిమా హీరో అంటూ బాలయ్య వారసుడిని పరిచయం చేశారు. ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్ నుంచి రెండో ప్రాజెక్ట్‌గా రానున్న సినిమాలో మోక్షజ్ఞ అలరించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement