మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అస్వస్థతకు గురై కొచ్చిలోని ఆసుపత్రిలో చేరారు. తాజాగా ఆయన ఆరోగ్యంపై ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి. ప్రస్తుతం మోహన్ లాల్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే, ఆయన తీవ్రమైన జ్వరం, వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ముఖ్యంగా రద్దీ ప్రదేశాలను నివారించేందుకు ఐదు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement