ప్రముఖ మలయాళీ నటుడు మోహన్‌లాల్ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరం, కండరాల నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో ఆస్పత్రిలో చేరారు. కొచ్చిలోని అమృత ఆసుపత్రి వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
ఈ మేరకు మోహన్ లాల్ హెల్త్ బులిటెన్‌ను ఆస్పత్రి వర్గాలు విడుదల చేశాయి. ఐదు రోజుల వరకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. రద్దీ ప్రదేశాలతో పాటు షూటింగ్స్ కు కొన్నిరోజుల పాటు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం మోహన్ లాల్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందన్నారు.