మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ఆపరేషన్ వాలంటైన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే. దీనితో ఈ మూవీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 1న రిలీజ్ కి రెడీ అవుతోంది.
ఈ చిత్రంలో మాజీ ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ వరుణ్ కి జోడిగా నటిస్తోంది. ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ అంటే విజువల్ ఎఫెక్ట్స్ కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల విడుదలైన ట్రైలర్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ట్రైలర్ లో ఉన్న క్వాలిటీ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో ప్రచార కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయి. హైదరాబాద్ లో వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్ కి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. చిత్ర యూనిట్ ను అభినందించారు..
ఇక ఈ చిత్ర కథలో కీలక అంశం గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటే ప్రభుత్వం ఆర్మీకి ఎలాంటి ఆదేశాలు ఇస్తోంది.. డిఫెన్స్ మినిస్ట్రీ, ప్రధాని ఇలా అన్ని అంశాలు ఉంటాయి. అయితే ఈ చిత్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పాత్ర హైలైట్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ఉరి ది సర్జికల్ స్ట్రైక్ చిత్రంలో ప్రధాని నరేంద్ర మోడీని పోలిన పాత్రని చూపించారు. అది చాలా బాగా వర్కౌట్ అయింది. పాకిస్తాన్ దాడులపై వార్ రూమ్ లో ప్రధాని సమావేశాలు నిర్వహించడం.. సర్జికల్ స్ట్రైక్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో కూడా మోడీ పాత్ర అతికీలకంగా ఉండబోతుంది..