ఇంటర్నెట్ : తాప్సీ కీలక పాత్ర పోషించిన మిషన్ ఇంపాజిబుల్ చిత్రం ఓటి విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమా ఏప్రిల్ 29 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది తామెంతో ఫేమస్ ఇవ్వాలి. లెక్క పెట్టలేకంత డబ్బు సంపాదించాలనుకునే ముగ్గురు చిన్నారుల కథ ఇది. థియేటర్లలో ఇటీవల విడుదలై అలరించింది. స్వరూప్ ఆర్ఎస్ జే చర్శకత్వం వహించిన ఈ సినిమాతో హర్ష రోషన్, భాను ప్రకాష్, జైతీర్థ అనే ముగ్గురు బాల నటులు, వెండి తెరకు పరిచయమయ్యారు. నిరంజన్ రెడ్డి అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం మార్క్ కే రాబిన్, కూర్పు: రవితేజ గిరిజుల, ఛాయాగ్రహణం: దీపక్ యెరగరా…
కథేంటంటే తరుపతి దగ్గర్లోని వడమాల పేటకు చెందిన రఘుపతి (రోషన్), రాఘవ (భాను ప్రకాష్), రాజారామ్ (కైతీర్ణ) అనే ముగ్గురు పిల్లలి.. స్నేహం ఒక్కటి చేస్తుంది. చాలా ఫేమస్ అవ్వాలి. బోలెడంత డబ్బు సంపాదించాలనే తమ కలను నిజం చేసుకోవడం కోసం ఓ మిషన్ మొదలు పెడతారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంను పట్టుకొని పోలీసులకు అప్పజెప్పడం, అతనిపైనున్న రూ.50 లక్షలు రివార్డును తెచ్చుకోవడం. ఇదీ ఆ మిషన్ లక్ష్యం. దీనికోసమే ముగ్గురు ఇంట్లో వాళ్లుకు చెప్పకుండా ముంబాయి బయలుదేరుతారు. కానీ, దారితప్పి బెంగళూరులో దిగుతారు. మరి ఆ తర్వాత ఏమైంది? దావూద్ ని పట్టుకోవాలన్న లక్ష్యంతో వచ్చిన ఆ ముగ్గురు పిల్లలతో, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ శైలజ (తాపీ) చేయించిన సాహసాలేంటి చిన్నపిల్లల ఆక్రమరవాణా కేసుకు వీళ్లకు ఉన్న లింకేంటి? అన్నది మిగతా కథ
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..