Wednesday, November 20, 2024

అప్పుడే ఏడాది గడిచింది….ఐ లవ్ యు రానా !!

టాలీవుడ్ హల్క్ రానా మిహిక బజాజ్ ను ఇటీవల ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 8న రానా మిహికలు వివాహం చేసుకున్నారు. మీరు పెళ్లి అతికొద్దిమంది బంధువులు మధ్య ఈ వివాహం జరిగింది. అయితే సరిగ్గా మే 12న రానా తన వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చారని మిహిక బజాజ్ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సరిగ్గా గతేడాది రానా తన మనసులో మాట అడిగాడు.

దానికి సరే అంటూ తల ఊపాను. నా జీవితంలో తీసుకున్న గొప్ప నిర్ణయం ఇది. ఎప్పటికీ గుర్తుండిపోయే నిర్ణయం అని చెప్పగలను. అప్పుడే ఏడాది గడిచింది అంటే నమ్మశక్యంగా లేదు. ఐ లవ్ యు రానా అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే రానా ప్రస్తుతం విరాటపర్వం సినిమా చేస్తున్నాడు. అలాగే మరి కొన్ని సినిమాలలో కూడా నటిస్తున్నాడు. మొన్నటికి మొన్న అరణ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రానా.

Advertisement

తాజా వార్తలు

Advertisement