కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘మీటర్’. రమేష్ కడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్-టైన్‌మెంట్ నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. అతుల్య రవి కథానాయిక ఏప్రిల్ 7న సినిమా విడుదల కానున్న సందర్భంగా దర్శకుడు రమేష్ కడూరి మీటర్ విశేషాలని మీడియా సమావేశంలో పంచుకున్నారు.
మాది విజయనగరం జిల్లా గరివిడి మండలం. సినిమాలపై ఇష్టంతో వచ్చాను. బాబీ , గోపీచంద్ మలినేని దగ్గర సహాయ దర్శకుడిగా పని చేశాను. ఇప్పుడు మీటర్ తో దర్శకుడిగా పరిచయమౌతున్నాను.
రచయిత శ్రీకాంత్ విస్సా మైత్రీ మూవీ మేకర్స్ కి రిఫర్ చేశారు. తర్వాత బాబీ గారు, గోపీచంద్ మలినేని గారి ప్రోత్సాహంతో ఓకే అయింది.
మీటర్ అంటే కొలత. ఇందులో హీరోయిజానికి సంబధించిన ఒక కొలత.. ఎమోషన్, ప్రేమకు సంబధించిన ఒక కొలత… కిరణ్ అబ్బవరం ఇంతకుముందు చేసిన సినిమాలన్నిటి కంటే ఇది డిఫరెంట్ గా వుంటు-ంది.
కొలతలు పెట్టు-కొని చేయలేదు. ఈ కథ అలా కుదిరింది. రెగ్యులర్ ఫార్మెట్ ని బ్రేక్ చేస్తుంది. డిఫరెంట్ గా ఉంటూనే కమర్షియల్ ఎంటర్ -టైనర్ గా వుంటు-ంది.
ఈ కథ తో ఇద్దరు ముగ్గురు హీరోలని సంప్రదించాను. కొన్ని కారణాల వలన కుదరలేదు. అలా అని వుండిపొతే నా కెరీర్ ఆగిపోతుంది. అందుకే ఎవరిని పట్టు-కున్న మనం అనుకున్నట్లు- చూపించాలని నిర్ణయించుకున్నాను.
అతుల్య రవి నటించిన తమిళ్ సినిమాలు చూశాను. తన నటన బావుంటు-ంది. తనకి తెలుగు కూడా రావడంతో నాకు ఇంకా ప్లస్ అయ్యింది.
కమర్షియల్ టోన్ తెలిసిన సంగీత దర్శకుడు సాయి కార్తిక్. తను చేసిన పటాస్ సినిమా నాకు చాలా ఇష్టం. మంచి బాణీలు ఇచ్చాడు.