మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్. ఆగస్టు 11న విడుదల కానున్న నేపథ్యంలో నిర్మాత అనిల్ సుంకర విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.- చిరంజీవి గారితో సినిమా చేయడం ఊహించలేదు. కానీ ఇప్పుడది నెరవేరుతోంది.- వేదాళం రీమేక్ ఎఎం రత్నం చేద్దామని అనుకున్నారు. కానీ ఎఎం రత్నం తో మంచి అనుబంధం వుంది. వేదాళం మొదట హిందీలో చేయాలని అనుకున్నాను. ఐతే ఇప్పుడు ఆయనే చేస్తున్నారు. కన్నడలో ఓ స్టార్ హీరోతో చేద్దామని సన్నాహాలు చేస్తుండగా ఈలోగా చిరంజీవి గారు డేట్స్ ఇవ్వడంతో కన్నడని పోస్ట్ పోన్ చేసి భోళా శంకర్ చేశాం.-
చిరంజీవి గారు ఈ సినిమా చేయడానికి మూలకారణం దర్శకుడు మెహర్ రమేష్ గారు. ఆయనకి కూడా ఈ సబ్జెక్ట్ చాలా ఇష్టం. రెండేళ్ళ క్రితమే ఈ సబ్జెక్ట్ చిరంజీవి గారితో చెప్పారట. చిరంజీవి గారికి చాలా నచ్చింది.- మా సినిమాల బడ్జెట్ ఎక్కువవు తున్న మాట నిజమే. అన్ని సినిమాల బడ్జెట్ లు ఎక్కువవుతున్నాయి. అప్పటికి ఇప్పటికీ రెవెన్యూ స్క్రీన్స్ కూడా పెరిగాయి. దానికి తగినట్టు ఖర్చులు వుంటాయి.- చిరంజీవి గారు బడ్జెట్ కంట్రోల్ చేయమని చెబుతారు. ఎలా తగ్గించాలనేది చూస్తారు. బడ్జెట్ కంట్రోల్ విషయంలో ఆయనకి వున్న క్లారిటీ- ఎవరికీ లేదు.- సిస్టర్ పాత్రలో కీర్తి సురేష్ వుండాలని ముందే నిర్ణయిం చుకున్నాం. చిరంజీవి గారు, కీర్తి సురేష్ గారి మధ్య బాండింగ్ జీవితంలో మర్చిపోలేనిదిగా నిలిచిపో యింది. కీర్తిని తప్పితే మరొకరిని ఆ పాత్రలో ఊహించలేను.- భోళా శంకర్ చేసేటప్పుడు ‘ఒక హీరోగా చెబుతున్న. ప్రతిరోజు మీరు సెట్ లో వుండాలి. నిర్మాత సెట్ లో వుంటే చిరంజీవి గారు చాలా ఆనందపడతారు’ అని మహేష్ చెప్పారు. చిరంజీవి గారితో చాలా మెమరబుల్ జర్నీ. ప్రతి రోజు ఏదో ఒకటి నేర్చుకున్నా. ఒక్క రోజు కూడా వృధా కాదు. చాలా ఎంజాయ్ చేశాను.