సీనియర్ జర్నలిస్ట్, యాంకర్ టీఎన్ఆర్ ఇటీవల కరోనా బారినపడి మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే టీఎన్ఆర్ మృతిపట్ల మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అదేవిధంగా టి ఎన్ ఆర్ భార్య పిల్లలకు ఫోన్ చేసి పరామర్శించిన మెగాస్టార్ తక్షణ ఖర్చుల కోసం లక్ష రూపాయలు సహాయం చేశారు. టి ఎన్ ఆర్ చేసిన ఎన్నో ఇంటర్వ్యూలు చూశానని…ఇంటర్వ్యూ చేసే విధానం చాలా బాగుంటుందని…ఆయన ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచారని అన్నారు.
ఈ కుటుంబానికి ఎలాంటి అవసరం వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అయితే మెగాస్టార్ తో ఫోన్ లో మాట్లాడిన టిఎన్ఆర్ భార్య మీరు అంటే ఆయనకు ఎంతో ఇష్టమని ఆయన 200 ఇంటర్వ్యూ మీతోనే చేయాలని అనుకునేవారని మీరు మాకు ఫోన్ చేయడం ఎంతో సంతోషం కలిగించిందని అన్నారు.