Saturday, September 21, 2024

Chiranjeevi | ‘ఇంద్ర’ టీంకి “చిరు” సత్కారం …

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు కానుక‌గా ఆయ‌న ఆల్ టైం బ్లాక్ బ‌స్ట‌ర్ ఇంద్ర సినిమాను రీ-రిలీజ్ చేశారు. దీంతో మెగాస్టార్ ఫ్యాన్స్ థియేటర్‌ల‌లో పండ‌గా చేసుకున్నారు. అయితే ఈ సినిమా ఇంత‌టి ఘ‌న‌విజ‌యం సాధించ‌డంతో పాటు 22 ఏండ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర టీంను ఇంటికి ప్ర‌త్యేకంగా ఆహ్వానించి సత్కరించాడు. దర్శకుడు బి.గోపాల్, నిర్మాల అశ్వినీదత్, రచయితలు పరుచూరి బ్రదర్స్, కథా రచయిత చిన్ని కృష్ణ, సంగీత దర్శకుడు మణిశర్మలను చిరంజీవి తన నివాసంలో ఘనంగా సత్కరించారు. దీనికి సంబంధించిన ఫొటోను చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement