Wednesday, November 20, 2024

ప్లాస్మా దానంపై చిరు ట్వీట్

చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ని బ్లడ్ బ్యాంక్ ఇప్పుడు ప్లాస్మా డొనేషన్ పై దృష్టి పెట్టింది. కరోనా కారణంగా గత ఏడాది చాలా వరకు బ్లడ్ బ్యాంకులో రక్త నిధి కొరత ఏర్పడింది. దాంతో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సైతం దానిపై దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రక్తదానం పై అవగాహన కల్పించింది.

కాగా ఇప్పుడు కరోనా సెకండ్ కారణంగా మరింతగా జన జీవితాలు అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో చిరంజీవి స్వయంగా ప్లాస్మా దానం చేయాల్సిందిగా ప్రజలను కోరుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేస్తే మరో నలుగురికి జీవితాన్ని ప్రసాదించినవారవుతారని చిరంజీవి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement