మెగా డాటర్ నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవలే నిహారిక ఉన్న ఇన్స్టాగ్రామ్ పోస్టులను చైతన్య తన అకౌంట్ నుంచి డిలీట్ చేయగా, ఇప్పుడు నిహారిక కూడా వారిద్దరు కలిసి దిగిన ఫోటోలన్నింటినీ డిలీట్ చేసారు. అంతే కాదు సోషల్ మీడియా వేదిక పై వీరిద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో (unfollow) కూడా అయ్యారు. వీరిద్దరి వైవాహిక బంధంలో సమస్య వచ్చిందని, పెళ్లైన రెండేళ్లకే విడాకులు తీసుకునే దశలో ఉన్నారని, కొన్ని నెలలుగా వారు విడివిడిగా ఉంటున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ విషయం పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
అయితే, ఇవ్వాల ఇన్స్టాగ్రామ్ లో నిహారిక పెట్టిన ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ప్రముఖ ఫొటో గ్రాఫర్ అరిఫ్ పుట్టిన రోజు సందర్భంగా ఇన్స్టా స్టోరీలో అతడితో దిగిన పిక్స్ షేర్ చేసుకుంది. ‘‘యూ ఆర్ వెరీ స్పెషల్’’ అంటూ చెప్పింది నిహారిక.
ఇక, గత కొద్ది రోజులుగా నిహారిక, ఆమె భర్త చైతన్య మధ్య మనస్పర్థలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వారి వైవాహిక సమస్యలకు ఖచ్చితమైన కారణం తెలియదు, కానీ వారు విడాకులు తీసుకోవడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. చట్టపరమైన చర్యలు కూడా పురోగతిలో ఉన్నట్లు వినికిడి. అయితే నిహారిక, చైతన్య తమ విడాకులు లేదా విడిపోవడానికి సంబంధించిన వివరాలను ఇంకా వెల్లడించలేదు.