Saturday, September 21, 2024

అక్కడ రోజా… ఇక్కడ ఎన్టీఆర్

మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల రోజా పై కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. నెటిజన్ల తో ముచ్చటించిన నాగబాబు జబర్దస్త్ లో మీకు నచ్చిన కమెడియన్ ఎవరు అని అడగగా… రోజా పేరు చెప్పి అందరికీ షాకిచ్చాడు. అయితే ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ పై తనదైన శైలిలో కామెంట్ చేశాడు.

ఓ నెటిజన్ వీర రాఘవరెడ్డి గురించి చెప్పు నారప రెడ్డి అని అడగగా ఇప్పటి తరం నటుల్లో టార్చ్ బేరర్ అంటూ నాగబాబు రిప్లై ఇచ్చాడు. ఇక నాగబాబు రిప్లై తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మరోవైపు తమ కుటుంబంలో అంతమంది హీరోలు ఉండగా వేరొక హీరోని అలా ప్రశంసించడం పట్ల నాగబాబు కూడా అభినందిస్తున్నారు. ఈ ఇద్దరు కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత సినిమాలో తండ్రి కొడుకులుగా నటించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement