అల్లరి నరేష్ హీరోగా, విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఉగ్రం. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నా రు. మిర్నా మీనన్ కథానాయికగా నటించింది. మే 5న సినిమా ప్రేక్షకుల ముందు కు రాబోతున్న సందర్భంగా నాయిక మిర్నా మీనన్ ఉగ్రం చిత్ర విశేషాలని మీడియాతో పంచుకున్నారు.
మీరు ఉగ్రం ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
నేను డెవలపర్‌ని. దుబాయిలో ఇంజనీ ర్‌గా పని చేశా. తర్వాత కేరళ వచ్చి పని చేశాను. కానీ చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. నటి కావా లని వుండేది. ఒక రోజు దర్శకుడు అమీర్ నుంచి కాల్ వచ్చింది. తమిళ్ లో ఆర్యతో నటించే అవకాశం వచ్చింది. అలా నా కెరీర్ మొదలైయింది. తర్వాత మోహ న్ లాల్ గారి బిగ్ బ్రదర్ చేశాను. అదే సమయంలోనే లాక్ డౌన్ వచ్చింది. దీని తర్వాత తెలుగులో క్రేజీ ఫెలో’ చేశాను. ఆ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ గారి జైలర్ సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే ఉగ్రం దర్శకుడు విజయ్ సంప్రదించారు. ఆ విధంగా ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చాను.
మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ?
ఉగ్రం కథ చెప్పినప్పుడే ఓకే చెప్పేశాను. కథ చాలా ఆసక్తికరంగా వుంటు-ంది. ఇందులో నా పాత్ర ఛాలెజింగ్ గా వుంటు-ంది. కాలేజీ అమ్మాయిగా, భార్యగా, ఒక బిడ్డకు తల్లిగా.. ఇలా భిన్నమైన కోణాలు నా పాత్రలో కనిపిస్తాయి. సవాల్‌గా స్వీకరించి ఈ పాత్రని చేశాను.
చిెత్ర కథలో మీ పాత్రకు ప్రాధాన్యత ఎలా వుంటు-ంది ?
సినిమాలో నా క్యారెక్టర్ పూర్తి స్థాయిలో వుంటు-ంది. నరేష్ గారితో పాటు- నా పాత్ర కూడా కథతో ప్రయాణిస్తూ వుంటు-ంది. నటనకు ఆస్కారం వుండే పాత్ర దక్కినందుకు చాలా ఆనందంగా వుంది.
ఏదైనా హోం వర్క్ చేశారా?
సెట్‌కి వచ్చే ముందు నేను హోం వర్క్ చేస్తాను. యాక్టింగ్‌ని ప్రొఫెషనల్‌గా నేర్చుకున్నాను. కాలేజీ అమ్మాయిగా చేసినప్పుడు , భార్యగా కనిపించినపుడు, ఒక బిడ్డకు తల్లిగా చేసినప్పుడు ఆలోచనలో, హావభావా ల్లో స్పష్టమైన తేడాలు ఉంటాయి. వాటి అన్నిటి పై ప్రత్యేక దృష్టి పెడతాను.
నరేష్ గారితో పని చేయడం ఎలా అనిపించిది ?
నరేష్ గారు చాలా కూల్‌గా వుంటారు. కామెడీ, సీరియస్ రెండు పాత్రలని అద్భు తంగా హ్యాండిల్ చే స్తారు. కళ్ళతో హావభావాలు పలికిస్తారు. గ్రేట్ కోస్టార్.
మీ పాత్రలో గ్లామర్ ఉంటు-ందా ?
ఇందులో ఒక పాట బెంగళూరులో షూట్ చేశాం. ఈ పాట కథలో భాగంగానే వుంటు-ంది. నేను ఇందులో బాధ్యత గల గృహిణిగా కనిపిస్తా. ఓ పోలీస్ అధికారికి భార్య. ఆ పాత్రకు ఎం త గ్లామర్ కావాలో అంత వుంటు-ంది.
ఉగ్రంలో ఎక్కువగా రాత్రి వేళల్లో షూట్ చేసారు కదా ?
అవును.. 75 రోజుల వర్కింగ్ కాల్షీట్ లో 55 రోజులు నైట్ షూట్ చేశాం.