టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన మీరాబాయి చాను బయోపిక్ తీసేందుకు కసరత్తు జరుగుతోంది. టోక్యో ఒలింపిక్ క్రీడల తొలిరోజునే 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ పోటీలో పాల్గొన్న మీరాబాయి చాను రజత పకం సాధించింది. ఈ పోటీలో ఇప్పటివరకు భారతదేశానికి పతకం సాధించిన ఏకైక క్రీడాకారిణిగా మీరాబాయి చాను నిలిచారు. ఒలింపిక్ చరిత్రలో వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు ఇది రెండో ఒలింపిక్ పతకం మాత్రమే. ఇక చాను బయోపిక్ తీసేందుకు ఇంఫాల్‌కు చెందిన స్యూటి ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ ముందుకొచ్చింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం మణిపూర్‌లోని నాంగ్‌పాక్ కాచింగ్ గ్రామంలో ఉన్న మీరాబాయి చాను నివాసంలో జరిగిన ఒక కార్యక్రమంలో మీరాబాయి, స్యూటి ఫిల్మ్ ప్రొడక్షన్స్.. ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఇంగ్లిష్‌తోపాటు వివిధ భారతీయ భాషల్లో డబ్ చేయనున్నట్లు బయోపిక్ నిర్మాతగా వ్యవహరిస్తున్న కంపెనీ ప్రెసిడెంట్ మనబ్ ఎంఎం తెలిపారు.
ఇది కూడా చదవండి: టీమిండియా బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్..