రావణుడిగా తాను నటించట్లేదని తేల్చి చెప్పారు కన్నడ హీరో యష్.. బాలీవుడ్ లోని మరో రామాయణం ప్రాజెక్టులో రావణుడిగా హీరో యష్ పేరు వినిపించింది. శ్రీరాముడిగా రణ్ బీర్ కపూర్ ను .. సీతాదేవిగా అలియా భట్ ను తీసుకుని, నితీశ్ తివారి తన దర్శకత్వంలో మరో రామాయణాన్ని రూపొందించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంపైనే రణ్ బీర్ – అలియా ఆయనను కలిశారంటూ అందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల చల్ చేశాయి. రావణుడిగా యశ్ నటించనున్నాడనగానే ఈ ప్రాజెక్టుపై ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది. ఇదే విషయాన్ని గురించి తాజాగా యశ్ దగ్గర ప్రస్తావించగా, తాను రావణుడిగా కనిపించనున్నాననే వార్తలో ఎంతమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చేశారు. తన తాజా ప్రాజెక్టు ఏమిటనేది త్వరలోనే ప్రకటిస్తానని చెప్పాడు. తనపై అభిమానుల అంచనాలకి తగినట్టుగా ఆ ప్రాజెక్టు ఉంటుందని చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement