Tuesday, November 19, 2024

సినిమాల‌లో కార్మిక గీతోత్స‌వాలు..

24 విభాగాలు కష్టించి పనిచేస్తే ఒక సినిమా రూపు దిద్దుకుంటుంది. చిత్ర ని ర్మాణంలో కార్మికుల శ్రమ శక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. గ్లామర్‌ ప్రపం చంలో కారుల్లో, విమానా ల్లో తిరిగే వారి గురించి చాలా మందికి తెలుస్తుం ది. కానీ బయటకు కనిపించకుండా శ్రమించే కార్మి కుల గురించి ప్రేక్షకులకు తెలిసింది చాలా తక్కువ. కర్మాగారాల్లో పనిచేసే శ్రమజీవులతో పోలిస్తే సినీ కార్మికులకు పనిగంటలు ఎక్కువే. ఔట్‌డోర్‌ షూటిం గ్‌ ఉంటే రోజుల తరబడి కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది.
ఇదిలా ఉంటే వినోదాన్ని అందించే సినిమా కార్మికుల కష్టసుఖాలు నేపథ్యంలో అనేక చిత్రాలను అందించింది.
కార్మికుల కథాంశంతో ఎన్నో తెలుగు చిత్రాలు వచ్చాయి. కథానాయకులు కార్మికుల పాత్రల్లో స్వేదం చిందించారు. వీరి పాత్రలకు తగ్గట్లు- పాటల రచయితలు వాళ్ల తరపున కలం ఎత్తితే.. గాయకులు బలంగా గళం వినిపిం చారు. అటు-వంటి కొ న్ని పాటల్ని ఈ కార్మిక దినోత్సవం సందర్భం గా ఓకసారి గుర్తు చేసుకుందాం.

మహానటుడు ఎన్టీ.రామారావు నలు పు, తెలుపు సినిమాల రోజుల్లోనే కార్మిక జెం డా అందుకున్నారు. శెభాష్‌ రాముడులో ఘంటసాల గళంతో ”జయమ్ము నిశ్చయమ్మురా.. జంకు గొంకు లేక నువ్వు సాగిపొమ్ము రా..” అంటూ కార్మికుల పక్షాన కదం తొక్కారు. ఈ పాటలో ఆయన రిక్షా కార్మికుడిగా కనిపిస్తారు.
ఎర్రసినిమాల నిర్మాణం విరివిరిగా జరుగుతున్న సీజన్‌లో సూపర్‌స్టార్‌ కృష్ణ ఎన్‌కౌంటర్‌ చిత్రంలో నక్సలై ట్‌గా నటించారు. నటి రోజా సైతం చేత తుపాకీ పట్టిన పాత్ర చేసింది.
విప్లవ సినిమాలు అనగానే గుర్తొచ్చే పేర్లు మాదాల రంగారావు, ఆర్‌. నారాయణమూర్తి. వీరి నమ్మిన సిద్దాంతంకోసం సినిమాలు తీశారు. విప్లవబాట వదల్లేదు. చివరికంటూ కార్మికుల, రైతుల పక్షాన నిలిచే సినిమాలుఅందించారు.
”అన్యాయం.. అక్రమాలు.. దోపిడీలు.. దు రంతాలు.. ఎన్నాళ్లని ఎన్నేళ్ల ని నిలదీసినదీ రోజే మేడే..” అంటూ కార్మిక దినోత్సవానికి సిసలైన అర్థం చెబుతూ సాగు తుంది ఎర్రమల్లెలు చిత్రంలో పాట.
మేడే అంటే వెంటనే గుర్తొచ్చే పేరు పీపుల్స్‌ స్టార్‌ ఆర్‌.నారాయణ మూర్తి. ఆయన పాట, పాత్ర.. ఎప్పుడూ పీడితుల పక్షమే.. శ్రమ జీవుల హక్కుల కోసమే. నారాయ ణమూర్తి పాత్రకు వందేమాతరం శ్రీనివాస్‌ గళం తోడై కదం తొక్కిన పాటలెన్నో. ‘ఎర్ర సైన్యం’లో ”బంజారే బంజో.. వోనారే బంజా…”, ‘ఒరేయ్‌ రిక్షా’లో ”నా రక్తంతో నడుపుతాను రిక్షాను..”. ‘చీమల దండు’లో ”ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నీ యాళ్లో.. ఎర్రెర్రనిదీ జెండెన్నీయల్లో…” అప్పట్లో జనాన్ని ఉర్రూతలూగించాయి. ‘సింగన్న’ చిత్రంలో .. ”ఆయారే మేడే.. ఆయుధమై నేడే..” అంటూ హోరెత్తిన పాటలు బూర్జువా, పెట్టు-బడిదారి, భూస్వాముల గుండెల్లో మర ఫిరంగుల్లా పేలాయి.
నందమూరి బాలకృష్ణ అప్పట్లో సింగరేణి కార్మికు డిగా నటించారు. ”రండి కదలి రండి.. నిదుర లెండి.. కలసి రండి…” అంటూ నిప్పు రవ్వలో కనిపించారు.
”భూమికీ పచ్చాని రంగేసినట్టే ఓయమ్మా లాలో ..” అనే పాట ప్రతి కార్మిక దినోత్సవాన శ్రమను నమ్ముకున్న ప్రతి ఒక్కరి గుండె తడుతూనే ఉంటు-ంది. కేజే ఏసుదాస్‌ గళం నుంచి జాలు వారిన ఈ గీతం కర్షకుల కష్టం గురించి చెబుతూ సాగుతుంది. ‘శ్రీరాములయ్య’ చిత్రంలోని ఈ పాట ఎందరినో అలరించింది. టైటిల్‌ పాత్రలో మోహన్‌బాబు నటించారు.
పల్లె వృత్తుల వెతల్ని కళ్లకు కట్టేలా గోరటి వెంకన్న అల్లిన పాట ”పల్లె కన్నీరు పెడుతుందో…” ‘కుబుసం’ సినిమాలో శ్రీహరి తన ఈ పాట, పాత్రకు ఎర్రదనం అద్దాడు.
ఇలా ఎన్నో గీతాలు కార్మికుల జీవితాన్ని, పోరాటాన్ని వెండితెరపై ఆవిష్కరించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement