Friday, October 18, 2024

Matka ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్.. నోరా అందాల ట్రీట్ అదిరింది!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ అప్‌కమింగ్ మూవీ ‘మట్కా’. దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కిస్తుండగా పీరియాడిక్ కథగా ఈ సినిమా రానుంది. ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘లే లే రాజా’ అనే క్లబ్ బీట్ సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి తన అందాల ఆరబోతతో ప్రేక్షకులను అలరించింది. సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ ఆకట్టుకునే సంగీతంతో ఈ పాటను స్వరపరిచారు.

YouTube video

ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ పలు డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తుండగా, అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను నవంబర్ 14న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement