Thursday, October 17, 2024

Mechanic Rocky | దీపావ‌ళి రేస్ లో మాస్ కా దాస్..

దీపావళి విడుదలకు రేస్ మొదలైంది… ఈ రేస్ లోకి ముందుగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వచ్చి చేరాడు. రామ్ తాళ్లూరి నిర్మాణంలో ‘మెకానిక్ రాకి’ అనే చిత్రంలో నటిస్తున్నాడు విశ్వక్ సేన్. రవితేజ ముళ్ళపూడి అనే డెబ్యూ డైరెక్టర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ను ప్రకటించింది నిర్మాణ సంస్థ.

దీపావళి కానుకగా అక్టోబరు 31న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు పోస్టర్ విడుదల చేశారు. కాగా ఈ సినిమా ఆల్ ఇండియా థియేట్రికల్ రైట్స్ ను ఏషియన్, సురేష్ సంస్థలు కొనుగోలు చేశారు. పండగ నాటికి ఈ రేస్ లోకి ఇంకెన్ని సినిమాలు వచ్చి చేరతాయో ఏవి కలెక్షన్లు సాధించి హిట్ గా నిలుస్థాయో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement