ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2 మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కానుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుందని తెలిసిందే.
మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైరల్ మంచి హైప్ క్రియేట్ చేశాయి. కాగా, తాజాగా Peelings ఫుల్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్.
రష్మిక, అల్లు అర్జున్ ఊరమాస్ స్టెప్పులతో సాగుతున్న ఈ పాట థియేటర్లు దద్దరిల్లిపోవడం గ్యారంటీ అని చెప్పొచ్చు. చంద్రబోస్ రాసిన ఈ పాటను డీఎస్పీ కంపోజిషన్‌లో శంకర్‌బాబు కందుకూరి, లక్ష్మి దాస పాడారు.