నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరింది. తనపై దాడి చేశారని మంచు మనోజ్ పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్‌కు స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేశారు. తనకు అయిన గాయాల మెడికల్ రికార్డులను సమర్పించారు అలాగే ఇతర ఆధారాలను ఆయన పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో సమర్పించినట్లుగా తెలుస్తోంది
కాగా, తాజాగా పహాడి షరీఫ్ సీఐ గురువా రెడ్డి మాట్లాడుతూ.. మంచు మనోజ్ తన కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేయలేదని వెల్లడించారు. తన ఇంట్లో ఉండగా పదిమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి వచ్చి తమపై దాడి చేశారని మంచు మనోజ్ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ ఘటనలో మనోజ్ కి ఒక్కరికే గాయాలు అయ్యాయని తెలిపినట్టు సీని వెల్లడించారు. తనకు తన కుటుంబ సభ్యులకు థ్రెట్ ఉందని మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నట్లు సీఐ తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామని మనోజ్‌కు చెప్పినట్టు సీఐ తెలిపారు.