Wednesday, July 3, 2024

MAA అధ్యక్షుడిగా మంచు విష్ణు.. ఏకగ్రీవంగా ఎన్నిక

టాలీవుడ్‌లో ప్రతి రెండేళ్లకోసారి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరుగుతాయి. కాగా, ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు మరోసారి ఎన్నికయ్యారు. 26 మంది సభ్యులు కలిసి ఈసారి ఎన్నికను ఏకగ్రీవంగా ముగించారు. మా అధ్యక్షుడిగా మరోసారి మంచు విష్ణుకు పదవి ఇచ్చారు. ‘మా’ అసోసిషన్ నూతన భవనం నిర్మించే వరకు తానే అధ్యక్షుడిగా ఉంటాను అంటూ మంచు విష్ణు తీర్మానం చేశారు. అలాగే రఘు బాబు జెనరల్ సెక్రెటరీగా, కరాటే కళ్యాణి జాయింట్ సెక్రటరీగా, శివ బాలాజీ ట్రెజర్‌గా, మధుమిత, శైలజ, జై వాణి ఈసీ మెంబెర్స్ గా ఎన్నికయ్యారు. ఇక ఈ రెండేళ్లలో విష్ణు పనితీరు పై లైఫ్ మెంబెర్స్ ప్రశంసలు కురిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement