మా అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో ఈసారి పోటీకి మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ,జీవిత రాజశేఖర్, నటి హేమ సిద్ధమయ్యారు. అయితే ఇంకా షెడ్యూలు విడుదల కాకముందే ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం మంచు విష్ణు వెనుకడుగు వేశారు. మా ప్రెసిడెంట్ ఎన్నికలపై మీడియాతో మాట్లాడిన మంచు విష్ణు… బాలకృష్ణ ప్రెసిడెంట్ కావాలని కోరారు.
ఇండస్ట్రీ పెద్దలు అంతా కలసి ఎవరో ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నా తనకు అభ్యంతరం లేదని…కానీ నందమూరి బాలకృష్ణ ప్రెసిడెంట్ అయితే బాగుంటుందని అది నా కోరిక అని చెప్పుకొచ్చారు. మరి ఇండస్ట్రీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఒకవేళ బాలకృష్ణ ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆయన అందుకు సిద్ధంగా ఉన్నారో లేదో చూడాలి.