టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన గొప్ప మనసును చాటుకున్నారు. ప్రస్తుతం మా అసోషియేషన్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న మోహన్ బాబు కెరీర్ పరంగా, సినిమాల్లో నటనతో పాటు యూనివర్శిటీ వ్యవహారాల్లో చాలా బిజీగా ఉన్నారు. కాగా, మంచు విష్ణు పండగ సందర్భంగా మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఏకంగా 120 మంది అనాథలను దత్తత తీసుకున్నాడు. తిరుపతిలోని బైరాగి పట్టెడ ప్రాంతానికి చెందిన మాతృష్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను హీరో మంచు విష్ణు దత్తత తీసుకున్నాడు. వారి పూర్తి బాధ్యత తీసుకున్నాడు. విద్యా, వైద్యంతో పాటు అన్ని విషయంలో ఓ కుటుంబ సభ్యుడిలా తోడుంటానని అన్నారు.
ఇకపై ఆ 120 మంది బాధ్యత తనదేనని, వారంతా తన కుటుంబ సభ్యులే అంటూ విష్ణు తెలిపారు. ఇలా విష్ణు చేసిన మంచి పనికి అభిమానులు ఎంతో ఫీదా అవుతున్నారు. సంక్రాంతి సందర్భంగా తిరుపతి వెళ్లిన ఆయన ఆ చిన్నారులతో కొంత సమయాన్ని గడిపారు.